కాకినాడ జిల్లాలో దంచికొట్టిన వర్షం రోడ్లపై చేరిన నీరు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని గత రెండు గంటలపాటు పలు ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కాకినాడ నగరం, పిఠాపురం, తుని పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లపై నీరు చేరి వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టగా లోతట్టు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశారు.