అమరావతిలో అర్నబ్ తుపాను ముప్పు: వాట్సాప్ ద్వారా సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
అర్నబ్ తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారులు తెలిపారు. తుపాను బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వారు వెల్లడించారు. తుపాను సమయంలో చెట్లు కూలడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలపై ప్రజలు 9552300009 నంబర్‌కు సందేశం పంపి ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే స్పందించి తగిన చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.