రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఎన్టీఆర్

రాయలసీమ అభివృద్ధి కోసం రూ.1 లక్ష కోట్ల భారీ వ్యయంతో సరికొత్త ప్రణాళికను రూపొందించినట్లు మాజీ మంత్రి, మైలవరం నేత దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా 9.6 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, 2029 జూలై నాటికి అదనంగా 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన సాగును విస్తరించడంతో పాటు పల్లెల్లో 5,721 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.