'భారత్ నెట్ అమలుకు చర్యలు': ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
రాష్ట్రంలో సవరించిన భారత్ నెట్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక ప్రాజెక్ట్ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిబంధనలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సాస్కీ మార్గదర్శకాల ప్రకారం అమరావతిలో భారత్‌నెట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద చేపట్టే మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ విస్తరణ పనులకు ఛార్జీలు, ఫీజుల మినహాయింపు పొందడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీని ఆదేశించింది.