టెక్కీకి షాకింగ్ ఘటన: ఉద్యోగ బాధ్యతలపై ప్రశ్నించినందుకు తొలగింపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

నిర్వహించాల్సిన బాధ్యతలపై స్పష్టత కోరినందుకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఉద్యోగం నుండి తొలగించినట్లు బాధితుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను ఆశించిన డెవలప్మెంట్ పని ఇవ్వకుండా కేవలం క్వాలిటీ అసూరెన్స్ పనులే చేయిస్తున్నారని అమెరికాలోని ఇంజనీరింగ్ హెడ్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రోల్ స్పష్టత అడుగుతూ స్లాక్లో మెసేజ్ పెట్టిన కొద్ది రోజులకే తనను బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రస్తుతం ఈ ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైందని తోటి ఉద్యోగులు పేర్కొన్నారు.