స్థానిక సంస్థల ఎన్నికలు: శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేసిన పునేఠా

రిపోర్టర్: గోపి స్థలం: విజయవాడ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామని, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.