'డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు కొత్త నిబంధనలు': అమరావతిలో హోంశాఖ ఉత్తర్వులు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులకు దేహదారుఢ్య, రాత పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ అమరావతిలో ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేవలం శారీరక కొలతలు, డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే ఉండగా, ఇప్పుడు తొలుత శారీరక కొలతలు, అనంతరం 1,600 మీటర్ల పరుగు పందెం దేహదారుఢ్య పరీక్ష, 100 మార్కులకు డ్రైవింగ్‌ టెస్ట్, చివర్లో మూడు గంటల రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ నిబంధనలతో 147 పోస్టులకు ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడనుంది.