కూసుమంచి మండలంలో లక్కీ డ్రాలో దక్కిన వినాయక లడ్డూ

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లాచెరువు గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. చిన్న స్కూల్ సమీపంలోని వినాయకుడి వద్ద స్వామివారి ప్రసాదంగా పది కిలోల లడ్డూను లక్కీ డ్రా ద్వారా అందజేశారు. ముద్రబోయిన వియాన్స్ లక్షిత్ అదృష్టవంతుడిగా ఎంపికై లడ్డూను దక్కించుకున్నారు. కొటేశ్వరరావు కుమారుడైన లక్షిత్ విజేతగా నిలవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.