అల్లూరి జిల్లా చింతలమ్మ ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రసిద్ధ చింతలమ్మ ఘాట్ రోడ్డులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఒక్కసారిగా రోడ్డుపైకి విరిగిపడ్డాయి. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ బండరాళ్ళు, మట్టి రోడ్డుకు అడ్డుగా పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి జేసీబీల సహాయంతో రోడ్డును శుభ్రం చేసే పనులను ముమ్మరం చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.