విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నైట్ విజన్ సీసీ కెమెరాల ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
నేరాల నియంత్రణ చర్యల్లో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నైట్ విజన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. శనివారం వీటిని ప్రారంభించిన ఆయన, దొంగతనాలు మరియు గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్తగా పన్నెండు కెమెరాలు అమర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఉన్న ముప్పై రెండు కెమెరాలకు అదనంగా వీటిని ఏర్పాటు చేశామని, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.