యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు.. పోస్టర్ ఆవిష్కరణ

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నల్లమల్ల గిరిప్రసాద్ భవన్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల వాల్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరగనున్న ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

రాష్ట్ర సహాయ కార్యదర్శి నానబాల రామకృష్ణ మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.