నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం: ముప్పై ఇద్దరు సైనికులు దుర్మరణం
రిపోర్టర్: హరి
స్థలం: నైజీరియా
నైజీరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ముప్పై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ విమానయాన మంత్రి ఫెస్టస్ కేయామో వెల్లడించారు. బెనిన్ నుంచి లాగోస్‌కు వెళ్తుండగా సైనిక విమానం ఒండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలో ఇరవై ఐదు మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనపై దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.