డిస్కంలకు ఊరట: కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి సరఫరాకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఒకటి, రెండు, ఎన్టీపీసి తెలంగాణ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు, కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాల నుంచి యాభై ఏడు పాయింట్ తొంభై ఆరు మెగావాట్ల విద్యుత్ తీసుకునేందుకు డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టులు ఎవరికీ కేటాయించని పదిహేను శాతం నుంచి విద్యుత్ తీసుకునేందుకు అనుమతించాలని పిటిషన్లో డిస్కంలు పేర్కొన్నాయి.