కొత్తవలసలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల

రిపోర్టర్: సతీష్ స్థలం: కొత్తవలస, విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతమార్కెట్‌లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని శ్రమదానం చేశారు.