కర్నూలు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై విద్యాశాఖ సమగ్ర విచారణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా కౌతాళంలో ఎస్జీటీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. డీఈఓ నేతృత్వంలో రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మెగా డీఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అపోహలు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డైరెక్టర్ హెచ్చరించారు.