సమయస్ఫూర్తితో యువకుడి ప్రాణాలను కాపాడిన బ్లూకోట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్

రిపోర్టర్: హరి స్థలం: జగిత్యాల

కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని బ్లూకోట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సమయస్ఫూర్తితో కాపాడినట్లు SP JAGTIAL వెల్లడించారు. డయల్ 112కు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ తక్షణమే స్పందించి యువకుడికి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. విధి నిర్వహణలో అప్రమత్తత ప్రదర్శించి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ సేవలను ఎస్పీ అభినందించారు.