పెద్దేముల్ సరిహద్దుల్ లో ఎర్రమట్టి అక్రమ రవాణా: నిమ్మకునీరెత్తిన యంత్రాంగంపై ప్రజల మండిపాటు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: పెద్దేముల్

పెద్దేముల్ మండల సరిహద్దుల్ లో ఎర్ర రాయి, ఎర్రమట్టి అక్రమ రవాణా విపరీతంగా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడ్డారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలతో కర్ణాటకకు ఖనిజ సంపదను తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా చర్యలు లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.