బాలాపూర్ గణేషుడిని దర్శించుకున్న నందమూరి జానకి రామ్ భార్య దీపికా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
దివంగత నందమూరి జానకి రామ్ భార్య, ఎన్టీఆర్ వదిన అయిన దీపికా తాజాగా ప్రసిద్ధ బాలాపూర్ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ పవిత్ర సందర్భానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫోటోలను ఆమె తన అధికారిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.