కాళీఘాట్ ఆలయ లాకర్ తాళం మాయంపై వివాదం.
రిపోర్టర్: హరి
స్థలం: పశ్చిమ బెంగాల్
కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ ఆలయానికి చెందిన ఎస్బీఐ లాకర్ తాళం 1980 నుంచి కనిపించడం లేదని కుటుంబ వారసుడు దేబర్షి రాయ్ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. ఆలయ ఆస్తులు, విరాళాల లెక్కల్లో పారదర్శకత లోపించిందని, లాకర్‌లోని విలువైన వస్తువులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.