ఏపీ రాజకీయాల్లో జగన్ వర్సెస్ లోకేష్ కొత్త సమరం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు స్థానంలో వైఎస్ జగన్ వర్సెస్ నారా లోకేష్ కొత్త పోరు తెరపైకి వచ్చింది. మెగా డీఎస్సీ అంశం ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. డీఎస్సీ ఆరోపణలను ఖండిస్తూ లోకేష్ స్పందించగా, ప్రభుత్వ విధానాలపై వైసీపీ ఒత్తిడి పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది.