ఐచీ నాగోయా షూటింగ్ పోటీల్లో రజతం సాధించిన ఎలవెనిల్ వలరివన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: గుజరాత్

అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్ ఎలవెనిల్ వలరివన్ ఐచీ నాగోయా వేదికగా జరిగిన పోటీల్లో రజత పతకం సాధించి తన కుటుంబంలో ఆనందం నింపారు. గతంలో జకార్తా ఆసియా క్రీడలు, టోక్యో మరియు పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయిన ఆమె, ఈ విజయంతో తీవ్ర ఊరట చెందామని ఆమె తల్లి సరోజ తెలిపారు. చివరి రెండు షాట్ల కారణంగా స్వర్ణం చేజారిందని, అయినప్పటికీ ఈ పతకం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.