గడ్కోల్ గ్రామంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు: భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ పూజలు
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో దేవాదాయ శాఖ కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సండ్ర లత శంకర్ తో పాటు స్థానిక గ్రామస్తులు, భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.