తిరుమలలో కర్ణాటక ప్రవాసీ సౌధ ప్రైవేటీకరణపై టీటీడీ బోర్డు తీవ్ర అభ్యంతరం
రిపోర్టర్: సురేష్
స్థలం: Tirumala
తిరుమలలోని కర్ణాటక అతిథిగృహం నిర్వహణ బాధ్యతలను పర్యాటక సంస్థకు అప్పగించడంపై వివాదం చెలరేగింది. ప్రవాసీ సౌధను ముప్పై సంవత్సరాల పాటు బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. ఆధ్యాత్మిక సేవలను వాణిజ్య కోణంలోకి మార్చడం దేవాదాయ చట్టానికి విరుద్ధమని, వెంటనే పునరాలోచించాలని ఆయన ఆదివారం స్పష్టం చేశారు.