మార్కాపురంలో దేవాలయాల దొంగల ముఠా అరెస్ట్.. 22 లక్షల సొత్తు స్వాధీనం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మార్కాపురం

మార్కాపురం జిల్లా పరిధిలోని పలు మండలాల్లో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న 13 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 22.70 లక్షల రూపాయల విలువైన పంచలోహ విగ్రహాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

పామూరు మండలం రావిగుంటపల్లి వద్ద నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తెలిపారు. చోరీలకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశామని, కేసును ఛేదించిన ప్రత్యేక బృందాలను ఆయన అభినందించారు. దేవాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు.