మన్యంలో సమాచార వ్యవస్థ మెరుగు: కొత్త సెల్టవర్ల ఏర్పాటుకు కూటమి సర్కార్ శ్రీకారం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
రాష్ట్రంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సెల్ సంకేతాలు, అంతర్జాల సేవలు అందేలా సుమారు 1,150 కొత్త సెల్టవర్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 900 వరకు టవర్లు నిర్మించగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో గిరిజనులకు అత్యవసర సేవలతో పాటు ప్రభుత్వ పథకాల సమాచారం తక్షణమే అందుతోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.