డాక్టర్ మనమోహన్ సింగ్ పేరుతో దేశంలోనే తొలి విశ్వవిద్యాలయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: వికారాబాద్

మాజీ ప్రధాని డాక్టర్ మనమోహన్ సింగ్ పేరుతో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన సూచనపై స్పందిస్తూ ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. గత ఏడాది డిసెంబర్ రెండవ తేదీనే డాక్టర్ మనమోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినట్లు ఆయన స్పష్టం చేశారు. మన దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ యూనివర్సిటీ దేశ విద్యా రంగానికి గర్వకారణమని ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు.