ఓపెన్ఏఐ సిస్టమ్స్ ను హ్యాక్ చేసిన తెలుగు టెకీ

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ఏఐ నిర్వహించిన బగ్ బౌంటీ ప్రోగ్రామ్ లో భాగంగా రాజమండ్రికి చెందిన సైబ్రా భద్రతా పరిశోధకుడు మోహన్ పెదపాటి నేతృత్వంలోని బృందం ఆ సంస్థ సిస్టమ్స్ లోని లోపాన్ని గుర్తించి సంచలనం సృష్టించింది. హ్యాక్ట్రాన్ ఏఐ సహ వ్యవస్థాపకులు హర్ష్ జైశ్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైనీలు కేవలం 72 గంటల్లోనే ఈ ప్రైవేట్ రిపాజిటరీ లోపాన్ని వెలికితీశారు. స్పందించిన ఓపెన్ఏఐ ఆ లోపాన్ని సరిచేసి ఈ బృందానికి 6500 డాలర్ల రివార్డును అందజేసింది.