దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువతకు అవగాహన సదస్సు నిర్వహణ

రిపోర్టర్: సతీష్ స్థలం: కామారెడ్డి

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీదేవి గార్డెన్లో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో యువత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పీ కామారెడ్డి (SP Kamareddy) వెల్లడించారు. ప్రేమ మోసాలకు దూరంగా ఉండాలని, మైనర్ డ్రైవింగ్ చేయకూడదని, మాదకద్రవ్యాలకు నో చెప్పాలని, సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. యువత బాగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.