ముంబై ఐఐటీ విద్యార్థి సాహిిల్ వాకోడే మృతిపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Mumbai
ముంబై ఐఐటీ విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసుకు సంబంధించి నిబంధనలు పాటించారా లేదా అని క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోందని పోలీసులు తెలిపారు. పరీక్షలో మొబైల్ ఫోన్ వాడారనే ఆరోపణలతో గంటల వ్యవధిలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్థుల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు భద్రతా ఏర్పాట్లపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పలు కీలక అంశాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.