పేదలకు నిత్యావసరాల పంపిణీ: పుట్టినరోజు వేడుకల్లో ఆదర్శంగా నిలిచిన ప్రముఖ దాతలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 375వ సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోళ్ళ రాధాకృష్ణమూర్తి పర్యవేక్షణలో ప్రముఖ వ్యాపారవేత్త వందనపు కృష్ణారావు మనవరాళ్లు జాశ్విశ్రీ, చానస్యతార జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిరుపేద కుటుంబానికి నెల కోటా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆడంబరాలకు పోకుండా పుట్టినరోజున పేదలను ఆదుకోవడం ఎంతో అభినందనీయమని స్థానికులు కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఆపన్నులకు నిరంతరం అండగా నిలవాలని పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.