విశ్వంభర సినిమా ఆలస్యంపై అసలు కారణం వెల్లడించిన నటుడు రాజీవ్ కనకాల

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం విశ్వంభర విడుదల ఆలస్యం కావడానికి గల అసలు కారణాలను ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తాజాగా స్పష్టం చేశారు. చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచాలనే ఉద్దేశంతోనే పనుల్ లో ఎలాంటి తొందరపాటు చేయడం లేదని రాజీవ్ కనకాల వెల్లడించారు. ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.