టెస్ట్ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా: ఆస్ట్రేలియాపై ఘన విజయం
రిపోర్టర్: సతీష్
స్థలం: కేప్‌టౌన్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను రెండుాంటికి ఒకటి తేడాతో కైవసం చేసుకున్నామని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపారు. కేప్‌టౌన్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో ప్రత్యర్థిని చిత్తు చేసి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. తొలి టెస్టులో ఓటమి చవిచూసినప్పటికీ అద్భుతంగా పుంజుకుని చారిత్రక విజయం సాధించామని బవుమా పేర్కొన్నారు.