టాలీవుడ్‌ను కించపరిస్తే సహించం: నటి రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నిర్మాత ఎస్.కె.ఎన్ ఫైర్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
నటి రాధికా ఆప్టే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు, కోట్ల రూపాయల పారితోషికాలు పొంది, ఆ తర్వాత ఇక్కడి సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడటం దురదృష్టకరమని ఆయన స్పష్టం చేశారు. గౌరవం ఎప్పుడూ పరస్పరం ఉండాలని, అవకాశాలు ఆస్వాదించి పరిశ్రమను అగౌరవపరచడం సరికాదని నిర్మాత ఎస్.కె.ఎన్ హెచ్చరించినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.