వరికుంటపాడు మండలంలో ఘనంగా రోడ్డు నిర్మాణ పనుల భూమిపూజ
రిపోర్టర్: రాము
స్థలం: వరికుంటపాడు
ఎస్పీఆర్ కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు, జడ్పీటీసీ రావిళ్ల నాగేంద్ర ఆధ్వర్యంలో వరికుంటపాడు మండలం రామాపురం బస్టాండు వద్ద రూ.2.08 కోట్లతో తారు, సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సహకారంతో ఈ రోడ్డు కల నెరవేరిందని, నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నాయకులు తెలిపారు.