జమ్మూకశ్మీర్ రాజకీయాల్ లో సంచలనం: ఎంపీ పదవికి ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ రాజీనామా

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీనగర్

జమ్మూకశ్మీర్ లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, శ్రీనగర్ లోక్ సభ సభ్యుడు ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ తన పార్లమెంటు స్థానానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. విలువల రాజకీయాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.