సూర్య హీరోగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా తెరకెక్కే అవకాశం

రిపోర్టర్: రాము స్థలం: తమిళనాడు

సూర్య కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం మణిరత్నం విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం పూర్తయిన తర్వాత, సూర్యతో సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అనుకున్న కథలో కొన్ని మార్పులు చేసి సూర్యకు వినిపించే యోచనలో మణిరత్నం ఉన్నట్లు తెలుస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.