ఎక్కడినుంచైనా భూ రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: దిల్లీ

దేశవ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వెల్లడించారు. దిల్లీలో డిజిటల్‌ భారత్‌ భూ రికార్డుల ఆధునికీకరణ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇకపై దేశంలో ఎక్కడినుంచైనా భూ రికార్డులను పరిశీలించుకోవడంతో పాటు, ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.