పాల్వంచలో ఐరన్ వ్యాపార సంస్థపై సీజీఎస్టీ అధికారుల తనిఖీలు

రిపోర్టర్: సునీల్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

పాల్వంచ పట్టణంలోని ఓ ఐరన్ వ్యాపార సంస్థపై సీజీఎస్టీ, ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు వ్యాపార సంస్థతో పాటు సంబంధిత నివాసంలోనూ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు, విక్రయ బిల్లులు, జీఎస్టీ రిటర్నులు, ఈ-వే బిల్లులు, స్టాక్ వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుమారు ముప్పై కోట్ల రూపాయల లావాదేవీలపై అధికారులు దృష్టి సారించినట్లు స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.