తమిళగ మక్కల్ కజగం పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అజిత్ ఫ్యాన్స్
రిపోర్టర్: రమేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని కల్లకురిచి జిల్లా ఉలందూరుపేటలో హీరో అజిత్ కుమార్ అభిమానులు తమిళగ మక్కల్ కజగం పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆబిత్, రాష్ట్ర కార్యదర్శిగా రామ్‌కుమార్, కోశాధికారిగా మహమ్మద్ షా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని అజిత్ కోసం ఖాళీగా ఉంచగా, విజయ్ పార్టీ జెండాను పోలిన రీతిలో పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో మధ్యలో రెండు చిరుతపులులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించడం తమిళనాట తీవ్ర చర్చనీయాంశమైంది.