జమ్మూకశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది యాసిర్ హతం

రిపోర్టర్: గోపి స్థలం: Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లోని యూస్‌మార్గ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తయ్యిబా ఉగ్రవాది యాసిర్ హతమయ్యాడు. పూంఛ్, సోనామార్గ్ దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఇతని కోసం బలగాలు వారం రోజులుగా గాలిస్తున్నాయి. 'ఆపరేషన్ అష్దర్'లో భాగంగా ఈ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఇతని సహచరుల కోసం గాలింపు కొనసాగుతోంది.