హాజీపల్లిలో సంచార జాతి పిల్లల కోసం నూతన పాఠశాల

రిపోర్టర్: Alfa News Desk స్థలం: షాద్‌నగర్

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం హాజీపల్లిలో సంచార జాతి పిల్లల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భూమిపూజ చేశారు. సుదూర ప్రాంత పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యతోనే అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, ప్రతి ఒక్కరూ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.