స్పామ్ కాల్స్ కట్టడికి ఏఐ విధానాన్ని తెచ్చిన ట్రాయ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: భారతదేశం
టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పామ్ కాల్స్ మరియు మెసేజ్లను అరికట్టడానికి నిబంధనలను మరింత కఠినం చేసింది. ఇందులో భాగంగా అనుమానిత స్పామ్‌ను గుర్తించడానికి కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పాటు, వినియోగదారుల కోసం అప్పీల్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్పామ్‌కు పాల్పడే నంబర్లను గుర్తించి షేర్ చేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది.