ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ డిమాండ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Telangana
ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.