మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్ట భద్రతపై వివాదం: హరీశ్ రావు ఆందోళన
రిపోర్టర్: రమేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ తిప్పారం వద్ద జరుగుతున్న పనులపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో నిజం లేదని జలమండలి డైరెక్టర్ మహేష్ స్పష్టం చేశారు. రిజర్వాయర్ కట్టకు ఎలాంటి ప్రమాదం లేదని, సురక్షితమైన సాంకేతికతతోనే పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. అయితే భారీ తవ్వకాలతో కట్ట స్థిరత్వానికి ప్రమాదం ఏర్పడిందని, నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా డిమాండ్ చేశారు.