నాగ్‌పూర్‌లో లక్నో కేఫ్ యజమాని హత్య కేసు నిందితురాలి అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Nagpur
లక్నో కేఫ్ యజమాని శివ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన శ్రద్ధా దూబేను నాగ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. పది రోజులుగా పరారీలో ఉన్న ఆమెను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి పట్టుకున్నట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని, నిందితులతో పాటు ఆమె సోదరి రష్మి, డ్రైవర్ తన్వీర్ అలీని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.