చేంగల్లో అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్తను పరామర్శించిన అరవింద్ ధర్మపురి

రిపోర్టర్: రమేష్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త బద్దం పెద్ద గంగారం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాయకులు అరవింద్ ధర్మపురి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ బాధితుడిని ఆప్యాయంగా పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని, వారిక్షేమమే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.