కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కొణిజర్ల
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని వైరా రోడ్డుపై ఎంపీడీఓ కార్యాలయం ముందు శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ బలంగా ఢీకొన్న ఈ ఘటనలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు.