రాప్తాడు విద్యార్థినికి మెరుగైన వైద్యం: స్పృహలోకి వచ్చిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి లోకేశ్ అప్డేట్
రిపోర్టర్: గోపి
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో రంపం దాడి ఘటనలో గాయపడి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. చిన్నారి స్పృహలోకి వచ్చిందని, ఆమెతో తల్లి మాట్లాడినట్లు వెల్లడించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే వెంటిలేటర్ సపోర్ట్ తొలగించే అవకాశం ఉందని, చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.