అమృత్‌సర్‌లో మహిళా ఎస్ఎచ్‌ఓపై నిహాంగ్ సిక్కుల దాడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమృత్‌సర్
పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ఝబాల్ రోడ్డులో శుక్రవారం రాత్రి ప్రత్యర్థి వర్గానికి చెందిన నిహాంగ్ సిక్కులపై దాడి జరుగుతుండగా అడ్డు వెళ్లిన గేట్ హకీమా పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్‌ఓ మంజిత్ కౌర్‌పై నిహాంగ్ సిక్కులు దురుసుగా ప్రవర్తించారు. గొంతు పట్టుకుని తోసివేస్తూ వీరంగం సృష్టించారు. రెండు వర్గాల మధ్య ఉన్న పాత కక్షల కారణంగా ఈ ఘర్షణ చోటుచేసుకోగా, పోలీసులు తీవ్ర ప్రతిఘటన మధ్య గాయపడిన వ్యక్తిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.