రాజోలులో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఇద్దరు మృతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. సోంపల్లిలో ద్విచక్ర వాహనాన్ని మరో బైక్ ఢీకొనడంతో కొల్లు పూజ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ఘటనలో శివకోటి బైపాస్ వద్ద కంకర గుట్టలను ఢీకొట్టి శెట్టిమి శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.